సుకుమార్.. ఈయన రూటే వేరు. అందరూ నడిచే దారిలో నడవడం అంటే కొత్తేముంది అనుకుంటాడు ఈ దర్శకుడు. తాను నడిచే దారిలోనే మరో పది మంది నడిచేలా చేయడమే సుకుమార్ కు ఇష్టం. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా ఏనాడూ రొటీన్ రూట్ లో వెళ్లలేదు సుకుమార్. ఆయన చేసిన సినిమాల్లో కథ రొటీన్ గా ఉన్నా.. కథనం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది.. ఉండేలా చూసుకుంటాడు ఈ దర్శకుడు. ఇలాంటి సుకుమార్ ఇప్పుడు నిర్మాతగా మారాడు. ఇప్పటికే కుమారి 21 ఎఫ్ ను సుకుమార్ రైటింగ్స్ పై నిర్మించిన సుక్కు.. ఇప్పుడు తన తండ్రి బిటిఆర్ నాయుడు పేరు మీద ఓ బ్యానర్ మొదలుపెట్టి.. అందులో తన సోదరుడు బండ్రెడి వెంకటేశ్వరావ్ తనయుడు అశోక్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు సుకుమార్. దీనికి తన మరో సోదరుడు బండ్రెడ్డి విజయ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.
ఈ సినిమాకు దర్శకుడు టైటిల్ కన్ఫర్మ్ చేసాడు సుకుమార్. హర్రర్ లవ్.. హిస్ ప్యాషన్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సుకుమారే అందిస్తున్నాడు. హరిప్రసాద్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. జూన్ 9 నుంచి సినిమా పట్టాలెక్కనుంది. ఇక తన తర్వాతి సినిమాపై కూడా నోరు విప్పాడు సుకుమార్. ఇప్పటికే కథ, స్క్రీన్ ప్లే అంతా సిద్ధమైందని.. త్వరలోనే హీరో ఎవరు, మిగిలిన వివరాలు బయటికి చెబుతానని చెప్పాడు సుకుమార్. ఈయన తర్వాతి సినిమా రామ్ చరణ్ తో ఉంటుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.
© Thupaki.in 2016 . Powered by Blogger .